ఆదివాసీల ప్రజలారా ఆలోచించండి

ఆదివాసీల ప్రజలారా ఆలోచించండి
  • మీ ఓటు హక్కుతో సరైన నాయకుడిని ఎన్నుకోండి.. 
  • రాజీకియ పార్టీ బూటకపు హామీలు నమ్మకండి 
  • జీఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి 

ముద్ర,వెంకటాపురం (నూ):ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలో గల ఆదివాసీ గ్రామాలు పర్యటిస్తూ.సుడిబాక గ్రామంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం.జి ఎస్ పి,ములుగు జిల్లా అధ్యక్షులు రేగా గణేష్ అధ్యక్షతన,రాష్ట్ర కార్యదర్శి పూణెం సాయి దొర మాట్లాడుతూ.ఎన్నికల సమయంలో రాజీకియ పార్టీ నేతల బూటకపు మాటలు నమ్మొదని..!గతంలో పోలవరం 7 ముంపు మండలాల ప్రజలను బలి ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తరువాత ఆదివాసీ 9 తెగలకు జరిగిన అన్యాయాలు అంతా ఇంతా కాదని,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో ఆదివాసీ ప్రజలను మొదటగా విడతియటం జరిగిందని.అలాగే 3 జీఓ చట్టం సుప్రీం కోర్టులో కొట్టు మిట్టడుతుంటే  రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ద్వారా 5వ షెడ్యూల్ కి సంబంధించి ఎలాంటి బలమైన ఆధారాలను సబ్మిట్ చేయకుండా నిర్లక్ష్యం వహించి కౌంటర్ దాఖలు అందించకుడా మౌనం పాటించారని ఆవేదన వ్యక్తం చేశారు,ఇది కేవలం గిరివాసుల పై కుట్ర పూరిత చర్యలుగా భావించాలని అన్నారు,1976 లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం కొసం లంబాడీలను కలపటం వలన  గిరిజన ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని,ఆదివాసీ 9 తెగలకు అందాల్సిన విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ మైదాన ప్రాంతంలొ 4%,ఏజెన్సీ ప్రాంతంలో 100% రావాల్సి ఉద్యోగ అవకాశాలు రాలేదు, ఇది ఇలా ఉండగా 1976 లో ఒక అగ్ర కులాన్ని మా తెగలలో కలపటం వలన అప్పటి నుండి ఇప్పటి వరకు రావాల్సిన అనేక ఉద్యోగాలను కోల్పోవటం జరగిందని.

ఇది చాలక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో ఏకంగా 11 ఇతర బీ.సీ కులాలను అంటే దాదాపు ఇంకా 40 లక్షల మందినీ ఎస్టీ జాబితా లో కలపాలని సిద్ధ పడ్డ,అసెంబ్లీలో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మన 12 మంది ఎమ్మెల్యేలు ఎంఎల్సి మన గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ ,చేసిన తీర్మనానికి మన దద్దమ్మ ఎమ్మెల్యే లు చప్పట్లు కొట్టి అసెంబ్లీ లో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించటం చాలా సిగ్గుచేటు.ఒకవేళ ఇదే జరిగితే మనకు రావాల్సిన వాట మనకు రాకపోగా 11 కులాల వారితో కూడ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో పోటీ పడాల్సి వస్తోందని ఒక్క సారి ఆదివాసీ యువత కూడా లోతుగా అధ్యయనం చెయ్యాలని అన్నారు.తెలంగాణ రాష్ర్టంలో ఆదివాసీ సమాజం షెడ్యూల్డ్ ప్రాంత ప్రజలు ట్రైబలేన..? కాదా...? అనే పరిస్తితి ఏర్పడిందని.5వ షెడ్యూల్ ప్రాంతాల్లో రాష్ట్రపతి గెజిట్ అమలులో ఉంటుంది కానీ మన చట్టాలకు జి. ఓ లకు విరుద్ధంగా 317 జిఓ,నీ తీసుకోని వచ్చి షెడ్యూల్ ప్రాంతంలొ అన్ని ఉద్యోగ ఖాళీలను నాన్ ట్రైబల్ ఉద్యోగులతో నింపటం వలన మా ఆదివాసి నిరుద్యోగులకు భవిష్యత్ లో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగం కలగానే మిగిలిపోతుంది అనిపిస్తుంది.

ఈసారి మరల తెలంగాణ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే  గిరిజనేతరులకు కూడా పొడు పట్టాలు ఇస్తామని బి ఆర్ ఎస్ పార్టీ చెప్పటం జరిగింది,ఇదే జరిగితే 1/70 చట్టాన్ని తుంగలో తొక్కి నట్లే , 5వ షెడ్యూల్ లో ఉన్న చట్టాలు భవిష్యత్ లో కనుమరుగు అయ్యే ప్రమాదం పొంచి ఉంది అందుకే  ఆదివాసీ ప్రజలారా మేలుకోండి...మి ఓటు హక్కుని వినియోగించుకునే ముందు ఆలోచించండి అని తెలియజేశారు,ఈ సమావేశంలో జి.ఎస్.పి జిల్లా నాయకులు పూణెం ప్రతాప్,చింత మోహన్,కనితి వెంకటకృష్ణ,పాయం కృష్ణ ,కార్యకర్తలు సందీప్,సుదర్శన్, పండు ,తదితరులు పాల్గొన్నారు