ఘనంగా టిపిసిసి డెలిగేట్ బర్త్ డే వేడుకలు

ఘనంగా టిపిసిసి డెలిగేట్ బర్త్ డే వేడుకలు

ముద్ర ప్రతినిధి , కోదాడ:- కోదాడ పట్టణ ప్రముఖ న్యాయవాది , టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు , అభిమానులు కోదాడలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు . ఉదయం నుండి పలువురు పార్టీ కార్యకర్తలు , అభిమానులు ఆయన నివాసానికి చేరుకొని కేక్ కట్ చేయించి శాలువాలు , బొకేలతో ఘనంగా సన్మానించారు . కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి ఆయనకు పుట్టినరోజు  శుభాకాంక్షలు తెలుపగా , మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు , మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు బోకే అందించి , మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు , కొండల్ రెడ్డి , రజనీకాంత్ , శేఖర్ , కొండల్ , సురేష్ తదితరులు పాల్గొన్నారు .