విద్యుతాఘాతానికి హార్డ్వేర్ షాప్ దగ్ధం

విద్యుతాఘాతానికి హార్డ్వేర్ షాప్ దగ్ధం

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- విద్యుతాఘాతానికి ఓ హార్డ్వేర్ షాపు దగ్డమైన ఘటన మంగళవారం రాత్రి భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన సీత శేఖర్ రోజు మాదిరిగా మంగళవారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్ళాడు.అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించి హార్డ్వేర్ షాప్ దగ్ధమైంది. బుధవారం రోజున షాప్ తెరిచేందుకు వచ్చి చూడగా దుకాణం నుండి పొగలు రావడానికి గమనించి బాధితుడు లబోదిబోమన్నాడు. సుమారు మూడు నుండి ఐదు లక్షల విలువ గల సామాను దగ్డమైనట్లు బాధితుడు సీత శేఖర్ తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్ఐ భాస్కర్ రెడ్డి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.