కేరళ సీఎం కూతురిపై మనీల్యాండరింగ్ కేసు నమోదు
ముద్ర,సెంట్రల్ డెస్క్:- అక్రమ చెల్లింపుల కేసులో కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణ, ఆమెకు చెందిన ఐటీ సంస్థ, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ 2018 నుండి 2019 వరకు వీణా కంపెనీకి – ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కి 1.72 కోట్ల రూపాయల అక్రమ చెల్లింపులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలిపింది.