మెదక్ జిల్లాలో పోలీసుల భారీగా నగదు పటివేత

మెదక్ జిల్లాలో పోలీసుల భారీగా నగదు పటివేత


ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయ శివారులో పోలీసుల పెట్రోలియంలో 12 లక్షల నగదు పట్టుబడ్డాయి. వాహలను పెట్రోలియం చేస్తున్న క్రమంలోరూ.12 లక్షల నగదును తమ సిబ్బంది పట్టుకున్నట్లు తూప్రాన్ సిఐ శ్రీధర్ తెలిపారు.పట్టుకున్న నగదును మెదక్ ఎన్నికల మానిటరింగ్ అధికారులకు అప్పగిస్తామని, విచారణ జరిపి వారు మళ్ళీ తిరిగి బాధితులకు  అప్పగిస్తారన్నారు.సొత్తు దొరికిన మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామానికి చెందిన లక్ష్మీ మాట్లాడుతూ తాను ఉప్పులింగాపూర్ గ్రామంలో భూమిని కొనుగోలు చేశారని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తెచ్చిన డబ్బును పోలీసులు తీసుకెళ్లారని రిజిస్ట్రేషన్ కు సంబంధించిన స్లాట్ ను చూపించారు. తన డబ్బులుతనకు ఇప్పించాలని సిఐకి మొరపెట్టుకున్నారు.అక్కన్నపేట శివారులో లక్షరామాయంపేట మండలం అక్కన్నపేట శివారులో పోలీసులు లక్ష రూపాయలను  పట్టుకున్నారు. మండలంలోని అక్కన్నపేటకు చెందిన దుర్గయ్య టీవీఎస్ మోటార్ సైకిల్ పై రామాయంపేట నుంచి అక్కన్నపేట వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేయగా లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు  ఎస్ఐ రంజిత్ తెలిపారు.మెదక్ మండలం మంబోజిపల్లి వద్ద 1.19 లక్షలు రూపాయలు పోలీసులు స్వాధీనం చె్యుకున్నట్లు తెలిసింది.