మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థిగా పద్మదేవేందర్ రెడ్డి నామినేషన్

మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థిగా పద్మదేవేందర్ రెడ్డి నామినేషన్

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం తన నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి అంబదాస్ రాజేశ్వర్ కు అందజేశారు. అంతకుముందు స్వగ్రామం రామాయంపేట మండలం కొనపూర్ లో పోచమ్మ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం శ్రీ ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకున్నారు.  బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరగా వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎఎంసి చైర్మన్ జగపతి, చెల్ల సుధాకర్, మౌలానా జావీద్ హుస్సేన్ తదితరులున్నారు.

6వ సారి ఎమ్మెల్యే పదవికి నామినేషన్

పద్మ దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి నానీనేషన్ వేయడం ఇది ఆరవసారి.

జెడ్పిటిసిగా ప్రస్థానం

2001లో తెలంగాణ సాధన కోసం కెసిఆర్ ప్రారంభించిన ఉద్యమంలో పాల్గొనేందుకు పద్మడివేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. వెంటనే జరిగిన ష్టానిక సంస్థల ఎన్నికల్లో రామాయంపేట జెడ్పిటీసిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2004లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో టిఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తులో రామాయంపేట స్థానం టిఆర్ఎస్ కు కేటాయించగా పద్మ దేవేందర్ రెడ్డికి అనూహ్యంగా అవకాశం రావడంతో పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014, 2018లో మెదక్ స్థానం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పద్మదేవేందర్ రెడ్డి పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొందారు. 2008లో రామాయంపేట ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా, 2009లో మెదక్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. మరోసారి కెసిఆర్ ఆశీర్వాదంతో బిఆర్ఎస్ అభ్యర్థిగా పద్మ దేవేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండవ సెట్ ఆర్ఓకు సమర్పించారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్,వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు ఉన్నారు. 

కోలాహలంగా బిఆర్ఎస్ జిల్లా కార్యాలయం

పార్టీ అభ్యర్థి ఎం.పద్మాదేవేందర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భరత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయం కోలాహలంగా మారింది. ఆమేషన్ సమాచారంతో నియోజకవర్గంలోని గ్రామాల నుండి ముఖ్య నాయకులు తరలివచారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, పార్టీ ఎన్నికల ఇంఛార్జి తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ను చంద్రపాల్, జితేందర్ రెడ్డి, ఎఎంసి చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, జెడ్పి ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జెడ్పీటీసీ పటట్లోరి మాధవి రాజు,  రామయంపేట ఏఎంసీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, పట్లోరి రాజు, గంగాధర్, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.