పద్మ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం రాంపూర్ ఆంజనేయుడు, వెంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు

పద్మ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం రాంపూర్ ఆంజనేయుడు, వెంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గురువారం తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ర్యాలీ పొడవునా గ్రామస్తులు  పూలు చల్లుతు, మహిళలు మంగళహారలతో స్వాగతించారు. అనంతరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

మాయ మాటలు నమ్మకండి

13 సంవత్సరాలుగా జాడ లేని మైనంపల్లి హనుమంతరావు స్వార్ధ మోసపూరిత రాజకీయాల కోసం కొడుకుని ఎమ్మెల్యేగా చేయాలని మళ్ళీ వస్తుండు...మాయమాటలను నమ్మొద్దని పద్మ దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం నేను రాజీనామా పెట్టి జై తెలంగాణ అంటే ..నువ్వు నై తెలంగాణ అన్నావని మైనంపల్లి హనుమంతు రావు పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన మైనంపల్లి హనుమంతరావు మెదక్ సెట్ కాదని  మూడు సంవత్సరాల ముందే మల్కాజిగిరికి మకాం మార్చారని 
ఆరోపించారు.

ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు.

మెదక్ జిల్లా కేంద్రం, రైలు కోసం మెదక్ యాదికి రాలేదు, నీ కొడుకు స్వార్ధ రాజకీయాల కోసం13  సంవత్సరాల తర్వాత మళ్లీ మెదక్ వస్తున్నారంటే అది నీ స్వార్థం కాద ఆన్నారు. 
నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడి ప్రాంత ప్రజలు మహిళలు నీళ్ల కోసం మస్తు గోస పడ్డారన్నారు. మూడు నెలలు ఎన్నికలు 
ఉన్నప్పుడు బోర్లు వేస్తామని వస్తున్నారని వారిని నమ్మొద్దు అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచినీళ్ల గోస తెలుసు కాబట్టి ఇంటింటికి మంచినీళ్లను అందించారని పేర్కన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు  రైతుబంధు,  బీమా లాంటి పథకాలు తీసుకొచ్చారన్నారు. ఈసారి రైతుబంధును 16 వేలకు పెంచుకుంటామన్నారు. గతంలో సిలిండర్ ధరలు తగ్గించాలని రాస్తారోకోలు ధర్నాలు చేసిన సంఘటనలు కోకొల్లులుగా ఉన్నాయన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డిసెంబర్ నుండి 400 రూపాయలకే సిలిండర్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, ఎంపీపీ సిద్ధిరాములు, నాయకులు సుధాకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.