మెదక్, నర్సాపూర్ డిపోల వద్ద నిరసనలు

ముద్ర ప్రతినిధి, మెదక్: టిఎస్ ఆర్టీసి సంస్థను ప్రభుత్వంలో విలీనం బిల్లును గవర్నర్ వెంటనే పాస్ చేయాలని డిమాండ్ చేస్తు మెదక్ డిపో ఆవరణలో నిరసన, ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రం మెదక్, నర్సాపూర్  డిపోల్లో ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు బస్సులు నడవలేదు. ప్రభుత్వం నిర్ణయించినా గవర్నర్ అడ్డుకోవటం సరి కాదని నాయకులు ఖండించారు. ఈ నిరసనలో నాయకులు పిఎస్ రెడ్డి, ఎంఆర్కే రావు, మొగులయ్య, సుబ్బారావు, కొత్త రాజు, పడిగ నరసింహులు, జి.రమేష్, స్వప్న, సంధ్యారాణి, ప్రమీల, వనిత, అనిత, సంగమేశ్వర్ గౌడ్, లక్ష్మణ్,కిష్టయ్య,ఎంఎం అలీ, షాదుల్లా, తాజుద్దీన్, దుర్గపతి, మెదక్ డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.