అమరులకు జోహార్​

అమరులకు జోహార్​
  • డీకే–తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల సభ
  • కటకం సుదర్శన్​కు నివాళులు
  • అమరుల కుటుంబాలతో సభ
  • ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీ దండకారణ్యం– తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ సభను నిర్వహించింది. విప్లవ అమరవీరులకు నివాళులర్పించింది. రెండు రాష్ట్రాల నుంచి మావోయిస్టు పార్టీ అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించిన పార్టీ వారందరికీ పాదాభివందనం చేసింది.  జులై 28 నుండి ఆగస్టు 4 వరకు అమర వీరుల వారోత్సవాలను పురస్కరించుకుని మావోయిస్టులు సరిహద్దు అటవీ ప్రాంతంలో ఘనంగా వారోత్సవాలు నిర్వహించారు. ఓ వైపున సరిహద్దు రాష్ట్రాల జాయిం ఆపరేషన్స్, మరో వైపున కేంద్ర పారామిలటరీ బలగాల ఆయా రాష్ట్రాల స్పెషల్ ఫోర్స్ అంతా కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా జరుపుతున్నా కీకారణ్యంలో సంస్మరణ సభలు నిర్వహించింది. మావోయిస్టు పార్టీ. తెలంగాణ, దక్షిణ్ బస్తర్ డివిజన్ కమిటీ నేతృత్వంలో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా స్మారక సభ నిర్వహించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కీలక నేత కటుకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అలియాస్ దూల దాదా స్మారక స్థూపాన్ని సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆయన సహచరి పద్మ ఆవిష్కరించారు.

తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో బుధ, గురువారాల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో మూడు పంచాయితీలకు చెందిన ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని 2వ తేదిన భారీ ర్యాలీ నిర్వహిస్తూ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం అమర వీరులకు నివాళులు అర్పించేందుకు రెండు నిమిషాలు మౌనం పాటించి, వారి ఆశయాల గురించి పలువురు వక్తలు సుదీర్ఘ ఉపన్యాసాలు చేశారు. ఈ సందర్భగా మావోయిస్టు నేతలు మాట్లాడుతూ... 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని చేస్తున్న ప్రకటనల వెనక సామ్రజ్య వాదులకు, దళారీ దోపిడీ వర్గాలకు దోచిపెట్టాలన్న లక్ష్యం ఉందని ఆరోపించారు. భారత్ ను అఖండ హిందూ రాజ్యంగా తయారు చేయడానికే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఫాసిజాన్ని అమలు చేస్తోందని వక్తలు మండిపడ్డారు. హిందుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకోవాల్సిన ఆవశ్యకత దేశ ప్రజలపై ఉందన్నారు. దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం ప్రధాన ప్రమాదకారిగా మారిందని, ఇదే భారతీయల ప్రథమ శతృవు అన్న విషయం గమనించాలని పిలుపునిచ్చారు.

నేడు రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలకు కారణమైన సామ్రాజ్యవాదాన్ని, దళారి దోపిడీ వర్గాలను దేశ ప్రజలపై హిందుత్వాన్ని బలవంతంగా రుద్దుతున్న ఆరెస్సెస్ దాని అనుభంద సంస్థలను కూకటి వేళ్లతో సహా పెకిలించడానికి ప్రజాస్వామ్య విప్లవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు. సామ్రాజ్య వాదుల శ్రీ సాయి అమర వీరుల కుటుంబాలను కూడా ఈ ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్, దక్షిన్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగాల్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా సభలకు ఆహ్వానించిన అమరవీరుల కుటుంబాలను మావోయిస్టు పార్టీ నేతలు సభకు పరిచయం చేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా తమ వారి ఆశయాలను వివరిస్తూ, తమ కోసం కాకుండా పీడిత ప్రజల కోసం తమ బిడ్డలు ప్రాణాలు కోల్పోవడాన్ని గర్వపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య నాట్య మంచ్, జన నాట్య మండలి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. దీంతో విప్లవ గేయాలతో దండకారణ్యం మారుమ్రోగింది. విప్లవ నినాదాలు పెద్ద ఎత్తున చేశాయి.