జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ కవితకు ఇవ్వాలి సియం కేసి ఆర్ కు లేఖ

జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ కవితకు ఇవ్వాలి సియం కేసి ఆర్ కు లేఖ

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికేట్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇవ్వాలని జగిత్యాల బిఆర్ ఎస్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు రాగుల జ్యోతి పరశురాం  సియం కేసిఆర్ కు లేఖ రాశారు. జగిత్యాల నియోజకవర్గం గురించి సియం కేసిఆర్ కు తెలియనిది కాదని జగిత్యాలలో ఒకసారి గెలిచిన వ్యక్తి రెండోసారి గెలవడని, గతంలో తెలంగాణ ఉద్యమకారులైన మకునూరి జితేందర్ రావు, ఓరుగంటి రమణారావు, ప్రస్తుత జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతలు టికెట్ ఆశిస్తున్న గతంలో  కల్వకుంట్ల కవిత మాట, మీ ఆదేశాల మేరకు డా. సంజయ్ కుమార్ ను  గెలిపించాం.  కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల డా. సంజయ్ కుమార్ కు  సీనియర్ నాయకులు ఎవరు సహకరించడంలేదన్నారు. కార్యకర్తలు, నాయకులు అసంతృప్తితో ఉన్నారని, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఏ ఒక్క కార్యకర్తకు ఎలాంటి లాభం చేకూర్చలేదు.. రాజకీయ పదవులు, నామినేటెడ్ పదవులలో సీనియర్లను విస్మరించి ప్రజల్లో పేరు ఉన్నటువంటి వ్యక్తులను ధిక్కరించి తన అనుచరులకు కాంట్రాక్టులు,  పదవులు తన అన్యాన్యులకు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.  జగిత్యాలలో నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే జీవన్ రెడ్డిని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓడించడం సంజయ్ తో సాద్యం  కాదని, కవితక్క జగిత్యాల నుంచి పోటీలో చేస్తే  అందరు ఎలాంటి విభేదాలు లేకుండా విజయానికి పాటుపడతారని లేఖలో పేర్కొన్నారు.

మా విన్నపాన్ని  మన్నించి జగిత్యాల అసెంబ్లీ స్థానాన్ని  కల్వకుంట్ల కవితకు ఇచ్చినట్లయితే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని సిం కేసిఆర్ ను కోరారు. డా. సంజయ్ కుమార్ కు ఇచ్చినట్లయితే ప్రత్యక్షంగాను పరోక్షంగానో జీవన్ రెడ్డి విజయానికే లాబం చేకూరుతుంది. సంజయ్ కుమార్ వైఖరి వల్ల కార్యకర్తల్లోనే పూర్తి వ్యతిరేకత ఉన్నదని, ఈ  విషయాన్ని గమనించి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని  జగిత్యాల టికెట్లు కేటాయించాలని లేఖలో కోరారు.