గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకోవాలి... ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకోవాలి... ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండల చల్ గల్ లో గ్రామ పంచాయతీ భవనం పైన ఏర్పాటు చేసిన మినీ లైబ్రరీని జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, జిల్లా లైబ్రరీ ఛైర్మెన్ డా. చంద్ర శేకర్ గౌడ్ లతో కలిసి ఎమ్మేల్యే ప్రారంబించారు.

ఈ సందర్భంగా  ప్రభుత్వ పాఠశాల లో చదివి 9.8 GPA సాధించిన సానియా జిల్లా ప్రభుత్వ పాటశాల విద్యార్థులలో జిల్లా  టాపర్ గా నిలవగా శాలువాతో సత్కరించి అభినందించారు. ఆనంతరం  గ్రామంలోని పల్లె దవాఖాన ను పరిశీలించి స్థానిక వైద్యులు విధులకు ఆలస్యంగా  రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద్ , సర్పంచ్ గంగ నర్సు రాజన్న, ఉప సర్పంచ్ పద్మ తిరుపతి, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ అసిఫ్,రైతు బందు మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,ఎంపిడిఓ రాజేశ్వరి,యంపిఓ రవిబాబు, గ్రామ శాక అధ్యక్షులు పూదరి శ్రీనివాస్,మాజీ సర్పంచ్ ముస్కెమ్ పోశమల్లు, ఏఎంసి డైరెక్టర్ పులిశెట్టి శ్రీనివాస్,సింగమ్ రంజిత్,చెట్లపెల్లి గంగారెడ్డి, ముత్తన్న,పేరుమండ్లు,
కొప్పు మహేష్,

సోహెల్,శేకర్, చందు, గంగారాం, వెంకటేష్, తడగొండ కిషన్, యాళ్ల మహేష్, కోరుట్ల శేఖర్, బడుగు రాకేష్, తిరుపతి, కోరుట్ల గంగాధర్, తోట గంగరాజాం, చిట్యాల లక్ష్మణ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.