ఈదురు గాలులతో వేల ఎకరాల్లో పంట నష్టం

ఈదురు గాలులతో వేల ఎకరాల్లో పంట నష్టం

 25 వేల ఎకరాల్లో నేల రాలిన మామిడి ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో గురవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు నేలవాలి రైతులు భారీగా నష్టపోయారు. పెద్ద ఎత్తున గాలులు విచాడంతో చెట్లు విరిగి పడి విద్యుతు వైర్లు తెగి పొగ, పలు ప్రాంతాల్లో విధ్యుత్ స్థంబాలు విరిగిపడి విద్యుత్ సరపరకు అంతరాయం కలిగింది. జగిత్యాల నుంచి కోరుట్ల, మెట్పల్లి వరకు జాతీయ రహదారి ఫై చెట్లు విరిగి పడడంతో కొన్ని గంటల పాటు ట్రాపిక్ నిలిచి పొయింది. జిల్లా లోని జగిత్యాల, మల్యాల, మేడిపల్లి, రాయికల్, గొల్లపల్లి, పెగడపల్లి, కోరుట్ల,మల్లాపూర్, సారంగాపూర్ తో పాటు పలు మండలాల్లో 25 వేల ఎకరాల్లో మామిడి కాయ నేల రాలింది. అలగే 7 మండలాలు, 66 గ్రామాల్లో 1988 మంది రైతులకు చెందిన 1513 ఎకరాల్లో నువ్వు, వరి, మొక్కజొన్న పంటలు నేలవాలయి.

చేతికి వచ్చిన పంటలు నేల పాలు కావడంతో రైతులు అవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపోయిన పంటలకు పరిహారం అందిచాలని రైతులు వేడుకుంటున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి సురేష్, హార్టికల్చర్ అధికారి ప్రతాప్ సింగ్ లు ఈదురు గాలులకు దెబ్బ తిన్న పంటలను పరిశిలించి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలి , రవీందర్ మామిడి రెడ్డి, రైతు గుల్లపేట రెండు రోజుల్లో కాయ తెంపి మర్క్తేట్ కు తీసుకోపోత అనుకున్న అంతలోనే ఈ గాలి దుమారం కాలను నేల రాల్చింది. అసేలే కాయకు వైరస్ సోకి బంక రావడంతో రేటు పూర్తిగా పడి పొయింది. అంతలోని ఈ గాలి ఉన్న కాయలను పట్టుక పొయింది. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.