ముగిసిన  అంత్యక్రియలు

ముగిసిన  అంత్యక్రియలు

దర్శకుడు కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట  శ్మశానవాటికలో కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. చివరిగా విశ్వనాథ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అంతకుమందు ఫిలిం చాంబర్‌ లో విశ్వనాథ్ పార్థీవదేహానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.

అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్.. అపోలో ఆస్పత్రి లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.  తెలుగు చిత్ర రంగంలో విశ్వనాథ్‌ది విలక్షణ పాత్ర.