అవిశ్వాసం పెట్టింది సొంత పార్టీకి చెందిన బిఆర్ఎస్ కౌన్సిలర్లే

అవిశ్వాసం పెట్టింది సొంత పార్టీకి చెందిన బిఆర్ఎస్ కౌన్సిలర్లే

ముద్ర, జమ్మికుంట:- జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టింది సొంత పార్టీకి చెందిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లే అని జమ్మికుంట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ టి పి సి సి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీని ప్రశించాం.నాకు ఓట్లు వేయకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య  చేసుకుంటామని అంటే ప్రజలు సెంటుబమెంటుతో ఓటువేశారు.

ప్రజలకు ఏమి చెప్పి గెలిచారో మరిచి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటూ.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చైర్మన్ రాజేశ్వరరావు పై ఉన్న వ్యతిరేకతతోనే సొంత పార్టీ కౌన్సిలర్ లే అవిశ్వాసం పెట్టారు.గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంస్కృతి బిఆర్ఎస్ పార్టీదే మాకు ఆ సంస్కృతి లేదు.రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ లపై అవిశ్వాసం పెట్టి నెగ్గే అవకాశం ఉంది కానీ ఆ సంస్కృతి మా పార్టీది కాదు.చట్టం తెలుసుకోకుండా కౌశిక్ రెడ్డి విప్ జారీ చేయడం తెలివితక్కువ పని కాదా.బిఅరెస్ నాయకుల మధ్య సమన్వయం లేక సొంత పార్టీ కౌన్సిలర్ లే చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి మా సహకారం కోరారు.ప్రజా సమస్యల పట్ల పాలక వర్గం పని చేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేయవద్దు.