ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ గా రాజేష్ గౌడ్

ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ గా రాజేష్ గౌడ్

ముద్ర.వీపనగండ్ల:- వైద్య ఆరోగ్యశాఖలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న వీపనగండ్ల గ్రామానికి చెందిన సురగాని రాజేష్ గౌడ్ జిల్లాస్థాయిలో ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ గా  మీదుగా ప్రశంసా పత్రం పొందారు. గ్రామానికి చెందిన రాజేష్ గౌడ్ పెబ్బేర్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు తనకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తుండటంతో వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్, అదనపు కలెక్టర్ ఎల్బీ సంచిత్ గంగ్వార్ , వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి లు రాజేష్ గౌడ్ కు ప్రశంసా పత్రం అందించి అభినందించారు.రాజేష్ గౌడ్ జిల్లాస్థాయిలో ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ గా ప్రశంసా పత్రం పొందడంతో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు.