రాజకీయాల్లో మార్పు కోసం యువత ముందుకు రావాలి - శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల ప్రచారంలో సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ

రాజకీయాల్లో మార్పు కోసం యువత ముందుకు రావాలి - శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల ప్రచారంలో సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ

ముద్ర.వీపనగండ్ల: రాజకీయాల్లో మార్పు కోసం దేశాభివృద్ధి కోసం యువత ముందుకు రావాలని సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం మండల పరిధిలోని బొల్లారం, చిన్నంబావి మండల కేంద్రంలో కొల్లాపూర్ నియోజక వర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్న శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల ప్రచారంలో జెడి లక్ష్మీనారాయణ పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజకీయాల్లో యువత ముందుకు రావాలని ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. శిరీష అలియాస్ బర్రెలక్క డిగ్రీలు చదువుతున్న సర్టిఫికెట్లు వస్తున్నాయి కానీ ఉద్యోగులు రావడంలేదని వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారటం, ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల శిరీష ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడటం ఆమె ధైర్యం సాహసం అందరికీ రోల్ మోడల్ గా నిలవాలని అన్నారు. యువత ప్రతి ఒక్కరూ ఇదేవిధంగా ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లోకి రావాలని కోరారు. దేశంలో చాలామంది పార్టీలు చాలామంది నాయకులు సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, ఇలాంటి యువతకు అవకాశాలు ఇచ్చి సభల్లో కొత్త గొంతుకు వినపడేలా అవకాశం కల్పించాలని అన్నారు. అందుకే శిరీష కు మద్దతు ఇవ్వటానికి ఇక్కడికి వచ్చానని, ఆంధ్రప్రదేశ్ కు చెందిన చెందిన యానం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కృష్ణారావు శిరీష కు ఆర్థిక సాయం చేశారని ఆమెకు మద్దతు తెలపటానికి ఇక్కడికి వస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో శిరీష ఇంతవరకు రావడం హర్షించదగ్గ విషయమని, ఇలాగే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో శిరీష ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లి ఈల తో ప్రజలను మేల్కొల్పాలని జెడి లక్ష్మీనారాయణ కోరారు. శిరీష కు కేటాయించిన ఈల గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి శిరీషను అసెంబ్లీకి పంపిస్తే కొల్లాపూర్ సమస్యలపై అసెంబ్లీలో  ఈల వేస్తుందని, స్వాతంత్ర ఉద్యమం కోసం దేశం మొత్తం అప్పుడు ఎలా కదిలిందో శిరీష విజయం కోసం అందరం కృషి చేయాలని జెడి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.