లోతట్టు ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలి

లోతట్టు ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలి

 మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్
 ముద్ర ప్రతినిధి, వనపర్తి : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై వనపర్తి జిల్లా కేంద్రంలో ఎక్కడికక్కడ డ్రైనేజీలు బ్లాక్ అవుతున్నాయని, అధికారులు లోతట్టు ప్రాంతాలను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అధికారుల ఆదేశించారు. బుధవారం వర్షాన్ని సహితం లెక్కచేయకుండా జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల్లో ఆయన పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రధానంగా వరద కాలువ లేని జంగిరిపురం కాలనీలో నీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కోవడాన్ని చూసినా మున్సిపల్ వైస్ చైర్మన్ సిబ్బందితో నీటిని డ్రైనేజీలకు మరలించారు. వర్షాల ప్రభావంతో దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. చెత్తను ఎక్కడికక్కడ వేయకుండా మున్సిపల్ ట్రాక్టర్ల లోని వేయాలని ఆయన కోరారు. మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల్లో నీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన ఆదేశించారు.