కిష్టారావుపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్

కిష్టారావుపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్

మహాదేవపూర్ మండల పరిధిలోని కృష్ణరావుపేట గ్రామంలో ఎస్సై రాజకుమార్ ఆధ్వర్యంలో బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం గ్రామంలోని ప్రధాన కూడలిలో గ్రామస్తులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామంలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నిషేధిత పదార్థాలైన గుట్కా, గుడుంబా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరంగా చర్యలు చేపడతామని తెలిపారు. యువత బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు, యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.