బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే కొల్లాపూర్ మరింత అభివృద్ధి

బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే కొల్లాపూర్ మరింత అభివృద్ధి

ముద్ర.వీపనగండ్ల: బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే కొల్లాపూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సతీమణి బీరం విజయమ్మ అన్నారు.వీపనగండ్ల మండలంలోని బొల్లారం  లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు పయనిస్తుందని,బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ, ఆసరా పెన్షన్లు దశలవారీగా రూ.5016 వరకు పెంపు, రైతుబంధు సాయం రూ.16,000వేలకు పెంపు, సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ .3000 భృతి,400 రూపాయలకే గ్యాస్ సిలెండర్ పథకం, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంపు,పేదలకు ఇళ్ల స్థలాలు.. మొదలైన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని..అందుకే కారు గుర్తుకు ఓటు వేసి మరొక్కసారి బీరం హర్షవర్ధన్ రెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో  నాయకులు  కార్యకర్తలు పాల్గొన్నారు.