ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడోత్సవాలు(డబుల్స్)

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడోత్సవాలు(డబుల్స్)

మోత్కూర్(ముద్ర న్యూస్): నియోస్పోర్ట్స్ క్లబ్ మోత్కుర్ ఆధ్వర్యంలో మార్చి 9, 10 తేదీలలో ఏర్పాటుచేయబోయే ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడోత్సవాలకి సంబంధించిన కరపత్రాన్ని స్థానిక మోత్కూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదిగా కరపత్ర ఆవిష్కరణ  చేశారు. ఈ కార్యక్రమంలో నియో స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యులు పోచం నారాయణ,కమిటీ సభ్యులు బాదె లక్ష్మణ్ వర్మ, వాసం వాసు, బద్దం నాగార్జున్ రెడ్డి, కూరెళ్ళ ఇంద్రశేఖర్, కోల శివకుమార్, చెడిపెళ్లి ఆదిత్య, కూరెల్ల రమేష్, కాషమేని రవికుమార్, మొరిగాల శీను, వాడకాల బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.