పల్లా’ మనకు ఆంధ్రోడే..!

పల్లా’ మనకు ఆంధ్రోడే..!
  • కోళ్ల తినేటోడు పోయిండంటే.. గొర్లను మింగేటొడు వస్తుండు
  • జనగామ జనం జాగ్రత్తగా ఉండాలి
  • వసల వాదులను తరిమికొట్టాలి
  • కేసీఆర్‌‌ పచ్చి అబద్దాల కోరు
  • జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ :‘ఇంతకాలం జనగామలో కోళ్లను తినేటోడు ఉంటుండే.. ఇప్పుడు అంతకంటే భయంకరంగా గొర్లను మింగేటోడు వస్తుండు.. జనగామ జనం అప్రమత్తంగా ఉండాలె.. జనగామ నుంచి పోటీ చేసేందుకు వచ్చిన పల్లా రాజేశ్వరెడ్డి మనకు ఆంధ్రోడే.. అతడికి తగిన గుణపాఠం చెప్పి తరిమికొట్టాలి..’ అని మాజీ ఎమ్మెల్యే, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనగామలో జరిగిన సభలో సీఎం కేసీఆర్‌‌ జనగామ జనానికి మళ్లో సారి మషిబూసి మారేడు కాయ చూపించాడని ఎద్దేవ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడుల్లా వచ్చి అవే హామీలు ఇస్తున్నాడు తప్ప ఒక్కటి కూడా నెవేర్చలేదన్నారు. ఇక జనగామ నుంచి పోటీలో ఉన్న పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి కేసీఆర్‌‌ ఇంటి పని మనిషి అని, ఇది నిన్న కేసీఆరే చెప్పిండన్నారు. ఆ పని మనిషిని అక్కడే పెట్టుకోవాలని సూచించారు. ‘పల్లా’ను గెలిపిస్తే చేర్యాల రెవెన్యూ డివిజన్‌ చేస్తాను అంటున్న కేసీఆర్‌‌.. అసలు చేర్యాలను ఆగం చేసిందే నువ్వు కాదా అని కొమ్మూరి ప్రశ్నించారు. చేర్యాల జనం రెవెన్యూ తదితర పనుల కోసం ఇప్పుడు హుస్నాబాద్‌, గజ్వేల్‌, సిద్దిపేటకు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

తమ్ముడు కేటీఆర్‌..‌ ‘పల్లా’ ఆగడాలను గుర్తించు..

సీఎం కేసీఆర్‌‌ పక్క ఉంటున్న పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ఆగడాలను తమ్ముడు కేటీఆర్‌‌ గుర్తించాలని కొమ్మూరి సూచించారు. ‘సీఎం కేసీఆర్‌‌ నా వాడు..’ అంటూ పల్లా చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఆయన ఎలా సంపాధిస్తున్నాడు..? అక్క విద్యాసంస్థలు ఎలా లాక్కున్నాడో..? మొత్తం చరిత్ర తమ వద్దని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కుర్రెములలో పేదల ప్లాట్లను కబ్జా చేశాడని ఆరోపించారు. అలాంటి అక్రమార్కుడు ఇక్కడకు వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. కేసీఆర్‌ పక్క ఉంటూ ఆయన సీటుకు కూడా ఎసరు పెట్టే ప్రమాదం లేకపోలేదని, కేటీఆర్‌‌ దీనిని గుర్తించాలని కొమ్మూరి కోరారు. ‌

నేను పక్కా లోకల్..

బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి నాన్లోకల్‌ వ్యక్తి అని, తాను పక్కా లోకల్‌ అని కొమ్మూరి చెప్పుకొచ్చారు. ఇప్పటికే స్థానికేతర పాలనలో జనగామ ప్రజలు అనుభవించిన కష్టాలు చాలని, ఈసారి లోకల్‌ వ్యక్తినైన తనకు మద్దతు ఇవ్వాలని ప్రతాప్‌రెడ్డి కోరారు. ఇక నిన్న జరిగిన సభకు కూడా మొత్తం నర్సంపేట, వేలేరు. ధర్మసాగర్‌‌ నుంచి జిల్లాకు సంబంధం లేని నాన్‌ లోకల్‌ జనాలను పైసలు తీసుకొచ్చారని ఆరోపించారు. జనగామ జనం కాంగ్రెస్‌ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సీనియర్‌‌ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీ విడడం జనగామలో ఎలాంటి ఎఫెక్ట్‌ ఉండదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. పొన్నాల వెళ్లిపోవడంతో టికెట్‌ రేసులో ఉన్నది తాను ఒక్కొడినేనని రేపో, ఎల్లుండో రెండో విడత అభ్యర్థల జాబితాలో జనగామ కూడా ఉంటుందని కొమ్మూరి పేర్కొన్నారు. 

 మంత్రి దయాకర్‌‌రావు నిజం చెప్పారు...

జనగామ సభలో స్థానిక మంత్రి దయాకర్‌‌రావు ‘మా ముఖాలు చూసి ఓట్లు వేయరు..’ అంటూ నిజం మాట్లాడారని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మనం ఎంత దాచాలనుకున్నా కొన్ని సందర్భాల్లో నిజాలు దాగవన్నారు. బీఆర్‌‌ఎస్‌ పరిస్థితిని బహిరంగంగా చెప్పి దయాకర్‌‌రావు తాను ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో మద్దూరు జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణ, టీపీసీసీ మాజీ కార్యదర్శి కంచ రాములు, చారాబుడ్ల దయాకర్ రెడ్డి, వడ్లకొండ పీఏసీఎస్‌ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, జనగామ జిల్లా నాయకులు జిల్లెల్ల సిద్దారెడ్డి, ఉడత రవియాదవ్, మేడ శ్రీనివాస్, గంగం నర్సింహరెడ్డి, తరిగొప్పుల మండల అధ్యక్షులు సిలివెలు సంపత్, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బనుక శివరాజ్ యాదవ్, కొత్త కరుణాకర్ రెడ్డి, జనగామ పట్టణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగర బోయిన మల్లేష్, లింగాల నర్సిరెడ్డి, మోటే శ్రీనివాస్, బొట్ల నర్సింగరావు, సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతీష్, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి, సీనియర్‌‌ నాయకులు బండారు శ్రీనివాస్, పట్టూరి శ్రీనివాస్, జాయ మల్లేష్, వేముల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.