మంత్రి హరీష్ రావుకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు

మంత్రి హరీష్ రావుకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు పలువురు ఒక్కరోజు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జూన్ మూడవ తేదీ (శనివారం రోజున) మంత్రి హరీష్ రావు పుట్టినరోజు కాగా శుక్రవారం నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మంత్రి హరీష్ రావు విచ్చేయడంతో స్థానిక నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డిగ్రీ కళాశాల గ్రౌండ్లో జర్నలిస్టులు కూడా మంత్రి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్ర సమితి మహిళా విభాగం నాయకురాల్లు హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఇతర మండలాలకు చెందిన పలువురు నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలు కప్పారు. పలువురు మెమొంటో అందజేశారు. క్యాంప్ కార్యాలయంలోనూ పలువురు అధికారులు, నాయకులు హరీష్ రావును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పుట్టినరోజు నాడు మంత్రి స్థానికంగా అందుబాటులో ఉండరని తెలిసి ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్ పర్యటనకు వెళ్ళిన మంత్రి హరీష్ రావుకు అక్కడ కూడా జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.