పసిపాప ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని అభినందించిన జడ్పీ చైర్పర్సన్

పసిపాప ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని అభినందించిన  జడ్పీ చైర్పర్సన్
ZP Chairperson Veleti Roja Radhakrishna Sharma

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: సిపిఆర్ చేసి పసి పాప ప్రాణాలు కాపాడిన 108 వైద్య సిబ్బందిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అభినందించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలోని 108 సిబ్బందిని జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ సన్మానించి అనంత మీడియా సమావేశంలో మాట్లాడారు మెగా కంపెనీలో పనిచేస్తూ ఉన్న బిహార్ రాష్ట్ర దంపతులకు 23 రోజుల పాపకు స్నానం చేస్తున్న సమయంలో ముక్కులోకి నీరు చేరడంతో పాపకు శ్వాస ఆడకుండా పోయింది అని తెలిపారు./గ్రామంలోని ఏఎన్ఎం ద్వారా 108 సిబ్బందికి సమాచారం అందించడంతో వారు క్షణాల్లో అక్కడికి చేరుకొని సిపిఆర్ వల్ల ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు.

పసిపాప ప్రాణాలు కాపాడడం శుభ పరిణామం అని అన్నారు. .సిపిఆర్ వల్ల గతంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు వైద్య సిబ్బంది కాపాడుగలిగినట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఆర్ పైన ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అందరికీ ఈ కార్యక్రమ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువతకు అవగాహన కల్పిస్తాం అని అన్నారు. ఈ ట్రైనింగ్ నేర్చుకుని ఉంటే ఎవరికైనా సమస్య వస్తే వెంబడే ప్రాణాలు కాపాడిన వారం అవుతామని తెలిపారు.  108 లో పనిచేస్తూ వారి ఫోన్ చేయగానే స్పందించి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.