చదువుల తల్లికి అండగా శాసనసభ్యులు జగదీష్ రెడ్డి

చదువుల తల్లికి అండగా శాసనసభ్యులు జగదీష్ రెడ్డి

  • గిరిజన పుత్రిక పట్ల ఔదార్యం చాటిన గుంటకండ్ల
  • ఆర్థిక సహాయం అందజేసి అక్కున చేర్చుకున్న మాజీ మంత్రి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఉన్నత చదువులకు ఆటంకంగా నిలిచిన ఆర్థిక పరిస్థితి తొ దిక్కుతోచని స్థితిలో ఉన్న  గిరిజన నిరుపేద విద్యార్థినికి మజీ మంత్రి, సూర్యాపేట  శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్  రెడ్డి అండ‌గా నిలిచారు.  ఆమె విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు అండగా ఉంటానని భ‌రోసానిచ్చారు.
 
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్  మండలం లాల్  సింగ్ తాండా కి చెందిన బానోతు ఐశ్వర్య చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తుంది. బి.ఎస్.సి నర్సింగ్ కు గాను ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సీటు సాదించిన ఐశ్వర్య, వ్య‌వ‌సాయ కూలీ కుటుంభం కావడం తొ ఇతర  ఖర్చులు  కూడా  భరించ లేని స్థితి లో ఉంది.  దీంతో  అక్కడి స్థానిక నాయకుల ద్వార ప‌రిస్థితి జగదీష్ రెడ్డి గారి దృష్టికి వ‌చ్చింది. ఐశ్వర్య పాటు ఆమె తల్లి  ని సూర్యాపేట కు పిలిపించిన శాసన సభ్యులు ఐశ్వర్య విద్య పూర్త‌య్యే వ‌ర‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. ఐశ్వర్య  ఉన్న‌త విద్య‌ పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు  భరోసా ఇచ్చారు.
 
తోటి  విద్యార్థుల‌కు ఐశ్వర్య స్ఫూర్తి: జగదీష్ రెడ్డి 

అత్యంత నిరుపేద పరిస్థితుల్లో అనేక సవాళ్లు దాటుకొని చదువులో రాణిస్తున్న ఐశ్వర్య తోటి  విద్యార్ధులకి  ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని సూర్యాపేట  శాసన సభ్యులు  గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ప్రజ్ఞాపాటవాలు ఎవరి సొత్తు కాదని, కృషితో ఏలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే  విషయాన్ని ఐశ్వర్య నిరూపించిందని  అన్నారు. ఐశర్వ్య లాంటి ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆడబిడ్డకి అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని  అన్నారు. వైద్య రంగం లొ భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

జగదీషన్న కు ఐశ్వర్య ధ‌న్య‌వాదాలు

త‌న నర్సింగ్ విద్య‌కు సాయ‌మందించిన జగదీశ్ రెడ్డి కి ఐశ్వర్య ఆమె కుటుంబ సభ్యులు  ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. జగదీషన్నకు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని, వైద్యరంగంలో ప్రజలకు సేవ చేసి, మా ఎమ్మెల్యే జగదీషన్న తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఐశ్వర్య పేర్కొన్నారు.