సల్మాన్‌ ఇంటివద్ద కాల్పులు చేసిన నిందితులు అరెస్టు...

సల్మాన్‌ ఇంటివద్ద కాల్పులు చేసిన నిందితులు అరెస్టు...

ముద్ర,సెంట్రల్ డెస్క్:- ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఎట్టకేలకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కాల్పులు జరిగిన తర్వాత నిందితులు ముంబయి నుంచి పారిపోయారు. చివరికి గుజరాత్‌లోని భూజ్‌లో పోలీసులుకు చిక్కారు. సోమవారం రాత్రి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని ముంబయికి తీసుకొచ్చి విచారణ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.