కరీంనగర్ లో ఫోన్ టాపింగ్ కీలక నిందితుడు రాధా కిషన్ రావు

కరీంనగర్ లో ఫోన్ టాపింగ్ కీలక నిందితుడు రాధా కిషన్ రావు
  • పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న రాధా కిషన్ తల్లి
  • తల్లి చికిత్స కోసం ప్రత్యేక అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్టు
  • భారీ బందోబస్తు మధ్య కరీంనగర్ కు తీసుకువచ్చిన జైల్ సిబ్బంది 


ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :   రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A-4గా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీ సీ పీ రాధా కిషన్ రావు కరీంనగర్ కు వచ్చారు. నగరంలోని సాగర్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాధా కిషన్ రావు తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును విన్నవించగా కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాదులోని  చెంచల్ గూడ జైలు సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్ కు తీసుకువచ్చారు. రాధా కిషన్ రావు తల్లి పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతుంది.


తల్లి చికిత్స కోసం నాంపల్లి కోర్టు  ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో కరీంనగర్ చేరుకున్న రాధా కిషన్ రావు తల్లిని పరామర్శించి  చికిత్స కి సంబంధించిన పూర్తి ఏర్పాట్లను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.