నిత్యం రాకపోకలు సాగించే రోడ్డును ఎలా మూసేస్తారు

నిత్యం రాకపోకలు సాగించే రోడ్డును ఎలా మూసేస్తారు

ముద్ర, రాజేంద్రనగర్: నార్సింగ్ మున్సిపాలిటీ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ మధ్య ఉన్న మట్టి రోడ్డును మూసివేయడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ రెండు మున్సిపాలిటీల మధ్యన ఉన్న బైరాగి గూడా - మంచిరేవుల గ్రామాల మధ్యన ఉన్న రోడ్డులో కొంత భాగం మిలట్రీ కి చెందిన స్థలం కావడంతో రోడ్డు అభివృద్ధి కి అడ్డంకిగా మారింది. ఇటీవల నార్సింగి, బండ్లగూడ జాగర్ మున్సిపాలిటీల అధికారులు తమ తమ పరిధికి వచ్చేంతవరకు రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు పది రోజులుగా పనులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఓ బిల్డర్ తన స్థలంలో రోడ్డు వేయవద్దని అడ్డుకొని రోడ్డుకు అడ్డంగా గుంతలు తీయడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానిక ప్రజలు సమస్యను స్థానిక అధికారులు, ప్రజాప్రతి నిధుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై బుధవారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు స్థానికులు వినతిపత్రం అందించారు. స్పందించిన ఆయన రోడ్డు మూసి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే స్వయంగా వచ్చి సమస్యను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, నాగార్జున రెడ్డి, శ్రీనివాస్, రమేష్ మంద, కిరణ్, వినయ్ పాల్గొన్నారు.