వివాహ బంధం విచ్ఛిన్నం సాకుతో విడాకులివ్వలేమన్న సుప్రీం

వివాహ బంధం విచ్ఛిన్నం సాకుతో విడాకులివ్వలేమన్న సుప్రీం

న్యూఢిల్లీ: భారతదేశంలో వివాహ వ్యవస్థ అత్యంత పవిత్రమైందని, ఆర్టికల్‌ 142 కింద వివాహ బంధం విచ్ఛిన్నమైందనే సాకుతో అందరినీ ఒకే గాటన కట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చండీగఢ్​కు చెందిన భార్యభర్తల కేసులో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. తన భార్యవేధింపులు తట్టుకోలేకపోతున్నానని విడాకులు ఇప్పించాలని భర్త కోరాడు. అయితే ఆమె వేధిస్తున్నట్లుగా సరైన సాక్ష్యాలు, ఆధారాలను అతను సమర్పించలేకపోయాడు. భార్య తన భర్తతోనే జీవితాంతం కలిసి ఉంటానని సుప్రీంకు వివరించింది. దీంతో గతంలో ఓ తీర్పును ఊటంకిస్తూ విడాకుల కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని విడాకులు మంజూరు చేయలేమని స్పష్టం చేసింది.