శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు

శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు
  • మణిపూర్​ సీఎం బీరేన్​ సింగ్​ హెచ్చరిక

మణిపూర్​: వివాదాస్పద వీడియోలను షేర్​ చేస్తూ మణిపూర్​లో శాంతికి భంగం వాటిల్లేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆ రాష్ర్ట సీఎం వీరేన్​సింగ్​ మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మణిపూర్​ అల్లర్లలో ఆస్తుల నష్టానికి పాల్పడిన వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. ఈ రకమైన వీడియోలు, ఆస్తుల ధ్వంసంతో సామాన్య జనజీవనానికి ఆటంకాలు కల్పించే చర్యలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. రాష్ర్ట ప్రభుత్వం, హోంశాఖ సోషల్​ మీడియాపై ఓ కన్నేసిందన్నారు. హింసాత్మక వీడియోలను ప్రసారం చేయవద్దన్నారు. ఒకవేళ హింసాత్మక వీడియోలపై ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మణిపూర్​ శాంతిలో, అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నదే తమ అభిమతమన్నారు. అంతేగాని ఎవ్వరైనా ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. కాగా 230 స్థానాలున్న మధ్యప్రదేశ్​లో గెలుపుకోసం బీజేపీ, ఇండియా కూటమి కాంగ్రెస్​లు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి.