రైస్ మిల్లులపై టాస్క్ ఫోర్స్ దాడులు

రైస్ మిల్లులపై టాస్క్ ఫోర్స్ దాడులు

ముద్ర, జమ్మికుంట:-గత రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసిన ధాన్యం సి ఎమ్మార్ కు పెట్టకుండా పక్క దారి పట్టించిన రైస్ మిల్లులపై స్టేట్ టాస్క్ ఫోర్స్ ఓఎస్ డీ ప్రభాకర్ ఆధ్వర్యంలో అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రాత్రి వరకు రికార్డులు ధాన్యం నిల్వలను పరిశీలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట మండలంలోని మిల్లులపై దాడి చేసి ధాన్యం లెక్కలు పరిశీలించారు. యాసంగి సీజన్లో తీర్చుకున్న ధాన్యాన్ని బియంగా మార్చి, సీఎ మ్మార్ కు పెట్టలేదు అన్న ఫిర్యాదు మేరకు తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు.

హుజురాబాద్ మండలంలోని మూడు మిల్లులు, జమ్మికుంటమండలంలోని మరో రెండు మిల్లులు తనిఖీలు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదని, భారీ మొత్తంలో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఇప్పటివరకు మిల్లర్లు తీసుకున్న ధాన్యమ్, సి ఎ మ్మార్ కు పెట్టనివి, గోదాంలో నిల్వ ఉన్న ధాన్యం వివరాలు సేకరించామని పేర్కొన్నారు. మరికొన్ని మిల్లులో తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. తనిఖీలు జరిపిన మిల్లులలో పెద్ద మొత్తంలో తరుగు ఉన్నట్లు గుర్తించామని, నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి, ఎస్సైలు జగ్గయ్య, కృష్ణ ఉన్నారు.