ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన

ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన
  • కలిగి ప్రణాళికాబద్ధంగా విధులను నిర్వర్తించాలి
  • జిల్లా కలెక్టర్ జెండగే హనుమంతు కొండిబా

 ముద్ర ప్రతినిధి భువనగిరి :ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ప్రణాళికాబద్ధంగా విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ జెండగే హనుమంతు కొండిబా ఎన్నికల నోడల్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లాకు నూతన  కలెక్టరుగా నియమితులైన ఆయన కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నోడల్ ఆఫీసర్లతో సమావేశమై వారి విధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలను పాటిస్తూ బాధ్యతగా విధులను నిర్వర్తించాలని,  సి-విజిల్ యాప్  ద్వారా వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, సువిధ ద్వారా వచ్చే అనుమతులను మొదట వచ్చిన వారికి మొదట పద్ధతిలో మంజూరు చేయాలని, పారదర్శకంగా బాధ్యతలను నిర్వహించాలని సూచించారు. 
సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏ.భాస్కరరావు, అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏసీపీలు వెంకటరెడ్డి, శివరామిరెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.