‘పల్లా’ అనుచరులారా ఖబర్దార్

‘పల్లా’ అనుచరులారా ఖబర్దార్

కాంగ్రెస్‌ పీసీసీ మెంబర్‌‌ చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ‘పల్లా’ అనుచరులారా ఖబర్దార్‌‌.. రేవంత్‌రెడ్డిపై అవాకులు చెవాకులు పేలితే తగిన గుణపాఠం చెబుతాం.. అంటూ టీపీసీసీ మెంబర్‌‌ చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం పట్టణ కేంద్రంలో గాయత్రి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జనగామ మున్సిపాలిటీ మాజీ చైర్మన్  వేమళ్ల సత్య నారాయణరెడ్డితో కలిసి మాట్లాడారు. 

జ్పడీ చైర్మన్‌ పాకాల సంపత్ రెడ్డి తమ నేత రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. అసలు పాగాలకు జనగామ నియోజకవర్గంతో  ఏం సంబంధం అని ప్రశ్నించారు. తాను చెంచాగిరి చేయాలనుకుంటే పల్లా వద్దా చేయాలి కానీ కాంగ్రెస్‌ పార్టీ వైపు వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త కరుణాకర్ రెడ్డి, వడ్లకొండ పీఏసీఎస్‌ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, మేడ శ్రీనివాస్, సుంకరి శ్రీనివాస్ రెడ్డి, బడికే కృష్ణ స్వామి, సర్వర్, లుంబా నాయక్ పాల్గొన్నారు.