ఫైర్ ఎన్ఓసీ ఉండాలి

ఫైర్ ఎన్ఓసీ ఉండాలి

అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

ముద్ర ప్రతినిధి, జనగామ : విద్యాసంస్థలు, ఫంక్షన్ హాల్స్, హోటల్స్ విధిగా అగ్నిమాపక శాఖ ద్వారా ఎన్ఓసి పొంది ఉండాలని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో  అగ్నిమాపక, జిల్లా పంచాయతీ, మున్సిపల్, సంబంధిత శాఖల అధికారులతో వేసవిలో అగ్నిప్రమాదాలు నివారణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రద్దీ ప్రదేశాలు, ముఖ్యమైన కూడళ్లలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కలిగించి, నివారణకు తోడ్పాటు అందించాలని కోరారు.  

జిల్లా పంచాయతీ శాఖ సహకారం తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు, హోటల్స్, విద్యాసంస్థలు, వ్యాపార వార్తక , పారిశ్రామిక ఏరియాలలో అగ్ని భద్రత పరికరాలను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, విద్యా భవనాలు, ఫంక్షన్ హాల్ తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ ద్వారా ఎన్వోసీ పొంది ఉండాలని తెలిపారు, వ్యవసాయ మార్కెటింగ్, పారిశ్రామిక సంస్థలు, అటవీ శాఖల పరిధిలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రజిత, అగ్నిమాపక అధికారి మధుకర్, డిపిఓ పార్థసారధి ఉన్నారు.