పొద్దంతా ముసురు.. చల్లగాలు..! 

  • జనగామలో మిచాంగ్​ తుఫాను ఎఫెక్ట్‌
  • ఎల్లో అలర్ట్ ప్రకటించిన అధికారులు

ముద్ర ప్రతినిధి, జనగామ : మిచాంగ్ తుఫాను ఎఫెక్ట్‌ తెలంగాణ జిల్లాల్లో సైతం పడుతోంది. తుఫాను ప్రభావంతో జనగామ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం పొద్దంతా సన్నటి ముసురు, సల్లగాలులతో జనం ఒకింత ఇబ్బంది పడ్డారు. వాతావరణ శాఖ జనగామ జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. జిల్లాలోని కొడకండ్ల మండలంలో 7 మిల్లీమీటర్ల వర్షం కురియగా.. నర్మెటలో 6.5, దేవరుప్పులలో 5.8, జాఫర్‌‌గఢ్‌ 4.9,

 లింగాలఘణపురంలో 4, స్టేషన్‌ఘన్‌పూర్‌‌లో 3.7, బచ్చన్నపేటలో 3.4, పాలకుర్తిలో 3, రఘునాథపల్లిలో 3, తరిగొప్పులలో 2.9, జనగామలో 2.9, చిలుపూరులో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 4.1 మి.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. నర్మెట మండలంలోని గండిరామవరం, కన్నెబోయినగూడెం, వెల్దండ, మచ్చుపహాడ్ తదితర గ్రామాల్లో కల్లాల్లో పోసిన ధాన్యం తడిసిపోయాయి.