కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ప్రవీణ్ రెడ్డిదే

కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ప్రవీణ్ రెడ్డిదే
  •  నో ఈక్వేషన్స్ గెలుపు గుర్రాలకే టికెట్స్ 
  •  అలిగిరెడ్డికి   ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్
  •  కాసేపట్లో అధికారిక  ప్రకటన
  •  జోష్ లో కాంగ్రెస్ శ్రేణులు

 ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంటు టికెట్ ను కాంగ్రెస్ అధిష్టానం అలిగిరెడ్డి  ప్రవీణ్ రెడ్డికి కేటాయించినట్లు తెలుస్తోంది. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలవడనుంది. రాజకీయ సమీకరణాలను పక్కనపెట్టి గెలుపు గుర్రాలే లక్ష్యంగా టిక్కెట్లు కేటాయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుండి ప్రవీణ్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా  తెలంగాణ వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గానికి 8 టికెట్లను కేటాయించారు. మంత్రి పొన్నం ప్రభాకర్  అభిప్రాయం మేరకే ప్రవీణ్ రెడ్డికి టికెట్ కేటాయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

వెలిచాల రాజేందర్ రావు తీన్మార్ మల్లన్న లు  చివరివరకు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వైపే అధిష్టానం  మొగ్గు చూపింది. హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేయడం ఆయనకు కలిసి వచ్చింది. దీంతోపాటు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా రెండు లక్షల 60 వేల  పైచిలుకు రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఉండడం అతనికి కలిసివచ్చే అంశం. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ  చేసిన ప్రత్యేక సర్వేలో సైతం అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డికి అనుకూలంగా రిపోర్ట్ వచ్చింది. దీంతో ప్రవీణ్ రెడ్డి పేరును అధిష్టానం ఫైనల్ చేసింది.