నేటి నుంచి రూ. 2 వేల నోట్ల మార్పిడి 

నేటి నుంచి రూ. 2 వేల నోట్ల మార్పిడి 

నేటి నుంచి రూ. 2 వేల నోట్ల మార్పిడి ప్రారంభం. సెప్టెంబరు 30 వరకు మార్చకునే అవకాశం ఉంది. ఒకసారి 10 నోట్లు మాత్రమే మార్చకునే అవకాశం ఉంది. ఒక్కరోజులో ఎన్నిసార్లయిన నోట్లు మార్చుకోవచ్చు. ఎలాంటి ఐడీ ప్రూఫ్స్​, బ్యాంకు అకౌంట్​ అవసరం లేదు. రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్​ కార్డ్​ అవసరం. రూ. 2 వేల నోట్ల డిపాజిట్​కూ ఇది వర్తిస్తుందని ఆర్​బీఐ తెలిపింది. రూ. 2 వేల నోట్ల ఉపసంహరణపై ఈ నెల 19న ఆర్​బీఐ ప్రకటన చేసింది. సెప్టెంబరు 30 తరువాత రూ. 2 వేల నోట్లు చెల్లవని ఆర్​బీఐ చెప్పలేదు. పరిస్థితిని బట్టి ఏం చేయాలో ఆర్బీఐ తరువాత నిర్ణయిస్తుంది.