విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం

విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం

ముద్ర,సెంట్రల్ డెస్క్:- విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆటోనగర్‌లోని ఆయిల్ ట్యాంకర్ గోడౌన్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.