ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రకు నేడు విరామం

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రకు నేడు విరామం

ముద్ర వార్తలు, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పార్టీ వర్గాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. సీఎం జగన్ బస్సు యాత్రలో వుండగా విజయవాడ సింగ్ నగర్ వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ఆయన నుదుటిపై గాయం అయ్యింది. బస్సులోనే ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు తర్వాత ఆయనకు ఆస్పత్రిలో చేర్చి, గాయానికి మూడు కుట్లు వేశారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన మేరకు ఆదివారం జరగాల్సిన బస్సు యాత్రను రద్దు చేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రకటించాయి. తదుపరి షెడ్యూల్ ను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని వెల్లడించాయి. తన పాలనలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలక వివరిస్తూ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో సీఎం జగన్ ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం విజయవాడ సింగ్ నగర్ నుంచి వివేకానంద స్కూలు పరిసర ప్రాంతాల్లో ఆయనపై క్యాట్ బాల్ తో పథకం ప్రకారమే దాడి చేసినట్టుగా అనుమానిస్తున్నారు.