పోగొట్టుకున్న బ్యాగును భక్తురాలికి అందించిన హోంగార్డు రవి

పోగొట్టుకున్న బ్యాగును భక్తురాలికి అందించిన హోంగార్డు రవి

అభినందించిన ఆలయ అధికారులు........ యాదగిరిగుట్ట, ముద్ర : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తురాలి బ్యాగ్ పోగొట్టుకోగా అట్టి బ్యాగును తిరిగి హోంగార్డు రవి భక్తురాలికి అందజేశారు. ఆదివారం చౌటుప్పల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన గీత అనే భక్తురాలు ఆదివారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం పడమటి రాజగోపురం వద్ద తన బ్యాగును పోగొట్టుకుంది. బ్యాగును గమనించిన  విధుల్లో ఉన్న హోంగార్డు రవి మైక్ ద్వారా సమాచారం  అందించారు. దీంతో బ్యాగును పోగొట్టుకున్న భక్తురాలు రాగా ఆమెకు  బ్యాగును అందజేశారు. బ్యాగులో నగదు విలువైన కార్డులు ఉన్నాయని భక్తురాలు చెప్పి సంతోషం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంపై హోంగార్డు రవిని ఆలయ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.