రేపే సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్...

రేపే సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్...

ముద్ర,సెంట్రల్ డెస్క్:- దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతల ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.2019లో 102 నియోజకవర్గాల్లో 45 స్థానాల్లో యుపీఎ విజయం సాధించగా.. 41 నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించారు.

  • రేపు పోలింగ్ జరిగే రాష్ట్రాలివే..

తొలి విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో.. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గ‌ఢ్‌, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్. మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్- నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 102 లోక్ సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్ లో 60 అసెంబ్లీ స్థానాల్లో 50స్థానాలకు పోలింగ్ జరగనుంది. పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అదేవిధంగా సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
జరగనుంది.