నా ఓటమి ఒకందుకు మంచిదే...

నా ఓటమి ఒకందుకు మంచిదే...
  • నా వాళ్ళు ఎవరో నన్ను మోసం చేసింది ఎవరో తేటతెల్లమైంది...
  • టిఆర్ఎస్ రైతు నిరాహార దీక్షలో ఫైళ్ల

ముద్ర ప్రతినిధి భువనగిరి : ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర తో పాటు బోనస్ 500 ప్రకటించాలని భువనగిరి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు స్థానిక రైతు బజార్ ఎదురుగా శనివారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఓటమి ఒక అందుకు మంచిదే నా వాళ్ళు ఎవరో నన్ను మోసం చేసింది ఎవరో తేటతెల్లమైందని అన్నారు . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అయి ఉంటే ఊహకే అందని విధంగా అభివృద్ధి జరిగేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి నేడు విస్మరించిందన్నారు.

కెసిఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని కాలేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్పది ప్రాజెక్టుకు కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ప్రాజెక్టుపై కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులకు కరెంటు బిల్లులు కొత్తమి కాదు మా ప్రభుత్వంలో నీళ్లు అందించాం. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మేము కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆచరణలో సాధ్యం కాని హామీలు ర్తెతులకు ,ప్రజలకు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ర్తెతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మాజీ గ్రంధాలయ చ్తెర్మన్ డాక్టర్ అమరేందర్, జడ్పిటిసి బీరు మల్లయ్య, మాజీ మున్సిపల్ చ్తెర్మన్ ఆంజనేయులు, మాజీ వ్తెస్ కిష్టయ్య, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు జనగాం పాండు, వెంకటేశం, నాయకులు అబ్బ గాని వెంకట్, ఇట్టబోయిన గోపాల్ ఉన్నారు.