ముగిసిన ఎమ్మెల్సీల నామినేషన్ల ప్రక్రియ

ముగిసిన ఎమ్మెల్సీల నామినేషన్ల ప్రక్రియ

చిత్తూరు: ఎమ్మెల్సీల నామినేషన్ల  ప్రక్రియ ముగిసింది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీచర్స్ స్థానానికి సంబంధించి ఆరుగురు అభ్యర్థులు, స్థానిక సంస్థల స్థానానికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పట్టభద్రుల స్థానానికి వైసీపీ, టీడీపీ, బీజేపీ  జనసేన, ఆమ్ఆద్మీ, బీఎస్పీ నుంచి నామినేషన్లు వేశారు. టీచర్స్ స్థానానికి వైసీపీ, పీడీఎఫ్, ఏపీటీఎఫ్ నుంచి నామినేషన్లు వేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి వైసీపీ నుంచి సిపాయి సుబ్రమణ్యం, పంచాయతీరాజ్ ఛాంబర్ నుంచి ధనుంజయనాయుడు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. బుధవారం ఒక్కరోజే పట్టభద్రుల స్థానానికి 15 మంది, ఉపాధ్యాయ స్థానానికి ఆరుగురు నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి, చిత్తూరు కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌కు అందజేశారు.