ఉత్తమ ప్రిన్సిపాల్ కు ఘన సన్మానం

ఉత్తమ ప్రిన్సిపాల్ కు ఘన సన్మానం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ని గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాల  ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం గారికి శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు శాలువతో సన్మానించి, మెమోంటో అందజేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గంగారాం మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఉత్తమ ప్రిన్సిపాల్ గా అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అవార్డు వెనుక విద్యార్థులు, అధ్యాపకులు బోధనేతర సిబ్బంది కృషి ఉందని చెప్పారు.వచ్చే నెల మొదటి తేదీ నుండి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణకు విద్యార్థులను సిద్ధం చేయాలని కోరారు.ఫిబ్రవరి 28 నుండి థియరీ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇంటర్ మిడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం,గార్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో లెక్చరర్లు పాక రాజగోపాల్, ఎన్.లక్ష్మణ్, లోక శ్రీధర్, జెట్టి విజయ్ కుమార్, కుర్ల రమేష్, వెంకటస్వామి, సరిత, సుజాత, రాజకుమార్,అంజలి, బోధనేతర సిబ్బంది ఉదయ్, గణేష్ కుమార్, రహీం, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.