జీడీకే 2 ఏ గనిలో ప్రమాదం

జీడీకే 2 ఏ గనిలో ప్రమాదం
  • మైనింగ్ సర్దార్ కు తీవ్ర గాయాలు

ముద్ర, గోదావరిఖని టౌన్:రామగుండం ఏరియా 1 పరిధిలోని జీడీకే 2 ఏ గనిలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగి మైనింగ్ సర్దార్ కు తీవ్ర గాయాలయ్యాయి. గనిలో మొదటి షిఫ్ట్ లో టబ్బులు లోడ్ చేసి బొగ్గు తరలిస్తున్న సమయంలో లింక్ ఊడిపోయింది. దీంతో విధులు నిర్వహిస్తున్న మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డికి కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన సమ్మిరెడ్డిని గోదావరిఖనిలోని సింగరేణి ఆస్పత్రికి తోటి కార్మికులు తరలించారు.