భూత్కూర్ లో ఘనంగా బీరప్ప ఉత్సవాలు

భూత్కూర్ లో ఘనంగా బీరప్ప ఉత్సవాలు

గంగాధర ముద్ర:  గంగాధర మండలంలోని గట్టుబుత్కూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ బీరప్ప కామరతి కళ్యాణంలో 5వ రోజు కార్యక్రమంలో భాగంగా నాగవెల్లి పట్న మహోత్సవానికి సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్బంగా పూజారులు నాగవెల్లి పట్నం వేసి బీరప్ప కి మొక్కులు చెల్లించారు. పద్దేనిమిది ఏళ్లుగా ఆలయ నిర్మాణం జరగక పోవడంతో గతేడాది సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి యాడది లోనే ఆలయాన్ని సుందరంగా నిర్మించారు

అనంతరం గత నెల 31 న ఘనంగా బీరప్ప ఉత్సవాలను ప్రారంభించి కురుమ గొల్లలు ప్రతి రోజు భక్తితో బీరప్ప ను కొలుస్తున్నారు ఒగ్గు డోలు కళాకారుల బృందాల సాంస్కృతిగా ప్రదర్శనలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తు గ్రామస్థులను ఆకట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి తొ పాటు గ్రామస్థులు పాల్గొన్నారు