ఏడాది పండగలన్నీ ఒకేసారి నిర్వహణ

ఏడాది పండగలన్నీ ఒకేసారి నిర్వహణ
  • లిటిల్ బడ్స్ పాఠశాలలో సందడే సందడి

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ మండల కేంద్రంలోని లిటిల్ బడ్స్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఏడాదిలో వచ్చే పండగలన్నింటినీ ఒకేసారి నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఇటీవల నిర్వహించిన ఈ కార్యక్రమం అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఉగాది, శ్రీరామనవమి, రాఖీ, బోనాలు, వినాయకచవితి, బతుకమ్మ, దసరా, దీపావళి, పీర్ల పండగ, కృష్ణాష్టమి, క్రిస్మస్, సంక్రాంత, శివరాత్రి , సమ్మక్క సారక్కల జాతరలను పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఆయా పండగల విశిష్టతలను విద్యార్థులకు వివరిస్తూ, ఒక నూతన ఒరవడిని ఏర్పరిచారు.

ఈ సందర్బంగా పాఠశాల కరస్పాండెంట్ మల్లగారి శ్రీనివాస్ మాట్లాడుతూ మన విశ్వాసాలలో ఒక్కో పండగకు ఒక్కో ప్రత్యేకత ఉందని, ఇలా అన్ని పండగలు ఒక్కరోజునే నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సహజంగా పండగలు అంటేనే అంతకు ముందురోజు వరకు పడిన కష్టాన్ని అంతా మరిచిపోయి, పండుగరోజు అందరూ ఆనందంగా ఉంటారని అన్నారు. అలాంటిది సంవత్సరానికి సరిపోయే ఆనందం అంత ఒక్కరోజే  తమ పాఠశాల లో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ సుక్క కాశి విశ్వనాథ్, ఉపాధ్యాయులు ఎలుగల నరేందర్, రామూర్తి, మంజుల, శ్యామల, హిమబిందు, సుప్రజ,చం ద్రకళ, నిర్మల, జ్యోత్స్, మానస, సునీత, లక్ష్మి, వైదేహి, రూప, పార్వతి, వీణ, గీత, దీప, విద్యార్థులు, వారి తల్లితండ్రులు, గ్రామ పెద్దలు  పాల్గొన్నారు.