వివేకా హత్య కేసులో రిమాండ్​ పొడిగింపు

వివేకా హత్య కేసులో రిమాండ్​ పొడిగింపు

జూలై 14న సీబీఐ కోర్టు వాయిదా

ముద్ర, తెలంగాణ బ్యూరో : వివేకా హత్య కేసులో నిందితులకు శుక్రవారంతో రిమాండ్​ గడువు ముగిసిన నేపథ్యంలో రిమాండ్​ను పొడిగించింది.  వైఎస్ వివేకా హత్య కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను సీబీఐ అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేశారు.  దీంతో రిమాండ్​ గడువు కూడా పొడిగించి. జూలై 14 వరకూ సీబీఐ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. నిందితులను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించునున్నారు. శుక్రవారం కోర్టుకు ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయకుమార్, భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. దస్తగిరి మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. సీబీఐ కోర్టులో అధికారులు అనుబంధ చార్జ్ షీట్‌ను దాఖలు చేశారు. ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్‌లు సీబీఐ దాఖలు చేసింది. ఈ రోజు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌తో కలిపి మొత్తం 3 ఛార్జ్ షీట్‌లు దాఖలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే సీబీఐ కోర్టు నిందితులకు రిమాండ్ పొడిగించింది. తదుపరి విచారణ జూలై 14 కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.