టాస్ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న ఆస్ట్రేలియా

టాస్ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న ఆస్ట్రేలియా

భారత్–-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో  ఆదివారం రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించనుంది. విశాఖపట్నం గణాంకాలు కూడా భారత్‌కు అనుకూలంగా ఉన్నందున భారత్‌కు విజయావకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ భారత జట్టు గత 10 ఏళ్లుగా ఒక్క వన్డే మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.

ఇది మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. కంగారూలతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో.. హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. విశాశ వన్డేలో మాత్రం రోహిత్ శర్మ రీఎంట్రీ ఇచ్చాడు. షమీ భజ్జీ రికార్డును బద్దలు కొట్టు ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన పరంగా హర్భజన్ సింగ్‌ను మహ్మద్ షమీ వదిలివేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఇద్దరి ఖాతాలో తలో 32 వికెట్లు ఉన్నాయి. స్వదేశంలో ఆస్ట్రేలియా కంటే భారత్ ఎక్కువ మ్యాచ్‌లు గెలిచే ఛాన్స్ ఉంది. భారత పిచ్‌లలో భారత్, ఆస్ట్రేలియా టీంలు తలో 30 మ్యాచ్‌లు గెలిచాయి. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత్ తమ సొంత పిచ్‌పై కంగారూలను అధిగమించే ఛాన్స్ ఉంది.