బిజెపి అధికారంలోకి వచ్చాక భూముల  వ్యవహారంపై,  వేలంలో కొనుగోలు చేస్తున్న వారి లావాదేవీల పైన  విచారణ

  • రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరసింహారెడ్డి హెచ్చరిక
  • బుద్వేల్  లోని మానస హిల్స్ వద్ద ఉద్రిక్తత
  • బుద్వేల్ లో భూముల విక్రయానికి నిరసనగా  దర్నా కు బి జె పి నేత ల యత్నం, అరెస్టు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-ప్రభుత్వ భూములు అమ్మవద్దంటూ బుద్వేల్ లో హెచ్ ఎం డీ ఎ  వెలం వేయనున్న ప్రభుత్వ భూముల వద్ద ధర్నాకు యత్నించిన బిజెపి నేతలను  పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు,  బిజెపి నాయకులను అడ్డుకోవడం తో ఉద్రిక్తత నేలకొండి. బిజెపి నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరామ్ బిజెపి నేతల ను పోలీసులు  అరెస్ట్ చేసారు.

ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల భూములను లాక్కొని, వేలంపాట వేస్తుందని  ఆరోపించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను బహిరంగ వేలంలో అమ్ముతుందని, అయితే రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమే నని, బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రస్తుత ప్రభుత్వం వేలంలో విక్రయించిన భూముల వ్యవహారంపై వాటిని కొనుగోలు చేస్తున్న వారి లావాదేవీల పైన కూడా విచారణ చేపడుతుందని అయన హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను కేవలం ఒక ఆదాయ వనరుగానే భావిస్తుందని, జిల్లాలో ఉన్న కోట్లాధి రూపాయల విలువైన ప్రభుత్వ భూములను బహిరంగ వేలంలో విక్రయిస్తున్న ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని మాత్రం విస్మరిస్తోందని  అయన విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ భూముల వేలంతో వచ్చిన ఆదాయంతో కరీంనగర్, వరంగల్ జిల్లాలలో అభివృద్ధిని చేపడుతుంది, కాని రంగారెడ్డి జిల్లాలో మాత్రం అభివృద్ధి శూన్యం అని అన్నారు.

బి జె పి నేత తూళ్ళ వీరేందర్ గౌడ్  మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను బహిరంగ వేలం ద్వారా అమ్ముతున్న వాటి పై బిజెపి అధికారంలోకి వచ్చాక విచారణ చేపడుతుందనీ అన్నారు. ఒక ధనిక రాష్ట్రం ఆప్పులపాలు కావడం ఎలాగో తెలుసుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన చూస్తే తెలుస్తుందని, ప్రభుత్వ భూములను అమ్ముకునే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు.బి జె పి నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.