జీవన్ రెడ్డి స్వలాభం కోసం గుట్టల మధ్య  జెఎన్ టియు కళాశాల  ఏర్పాటు చేశారు 

జీవన్ రెడ్డి స్వలాభం కోసం గుట్టల మధ్య  జెఎన్ టియు కళాశాల  ఏర్పాటు చేశారు 
  • కేంద్ర ప్రభుత్వ నిధులతోని గొర్రెల ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు..
  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కోరుట్ల బహిరంగ సభలో నిజాంబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తాను చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదని వ్యాఖ్యలను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి తీవ్రంగా ఖండించారు. జగిత్యాల జేఎన్ టి యూ కళాశాల తెచ్చిన అని చెప్తున్న జీవన్ రెడ్డి తన స్వలాభం కోసం  కొండగట్టు సమీపంలో గుట్టల మధ్య తన భూమికి సమీపంలో కళాశాల ఏర్పాటు చేశారని అన్నారు. విద్యార్థులు అక్కడికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని, రాత్రులు కిలోమీటర్ల దూరం ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి ఉందని కళాశాల ఏర్పాటు చేస్తే రోడ్డుకు ఏర్పాటు చేయాలని అన్నారు.

కళాశాల సమీపంలో ఉన్న మీ స్థలంలోనే కేంద్ర నిధులు  రూ.కోటి తీసుకొని మీరు గొర్రెల ఫామ్ ఏర్పాటు చేసుకోలేదా అని ప్రశ్నించారు. పొలాస ఫామ్ లో మీరు రాజకీయాలకు రాకముందే అక్కడ పరిశోధన స్థానం ఉందని ఎన్ డిఏ హయాంలోననే  అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల వచ్చిందని.. దానికి అనుబంధంగానే బిఎస్సి అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేశారని ఇందులో మీరు చేసింది ఏముందని ప్రశ్నించారు. మామిడి మార్కెట్ ఏర్పాటు చేసిన అని చెప్తున్నా మీరు ఢిల్లీ డేగలు మామిడి రైతుల కన్నిటికి కారణమైనప్పుడు మీరేం చేశారని  రైతులు నష్టపోవడానికి కారణం మీరు అని అన్నారు. రాజీవ్ రహదారి కరీంనగర్ వరకు వచ్చింది కానీ జగిత్యాల మీ స్వంత నియోజకవర్గానికి ఎందుకు తీసుకోరాలేదని ప్రశ్నించారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు నేర్చుకునే శిక్షణ కేంద్రం న్యాక్ సెంటర్ ను కూడా గుట్టల మధ్య పెట్టారని విద్యార్థులు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి... మీరు ప్రత్యేకంగా చెప్పుకునే అభివృద్ధి పని ఏదైనా ఉంటే చెప్పండి అని అన్నారు.